Monday, April 29, 2024

హీరోయిన్ డింపుల్ హయాతి వీరంగం.. కేసు నమోదు

హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో నిలిచారు. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీ కొట్టడం, కాలుతో తన్నడంతో రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డింపుల్‌పై ఐపీసీ సెక్షన్ 353,341,279 కింద కేసు నమోదు చేశారు.హీరోయిన్ డింపుల్ హయాతి ఐపీఎస్ రాహుల్ హెగ్డే జర్నలిస్టు కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్ వద్ద తరచూ ఇలాంటి గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డింపుల్ హయాతీ కాబోయే భర్త డేవిడ్ తన కారుతో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుతో ఢీకొట్టగా… డింపుల్ హయతి రాహుల్ హెగ్డే కారును కాలుతో తన్నారు. పలుమార్లు నచ్చచెప్పినా.. డింపుల్ హయాతి తీరులో మార్పు రాకపోవడంతో ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. డింపుల్‌పై ప్రభుత్వఆస్తుల ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement