Monday, November 11, 2024

TS | ట్రాక్టర్​ను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

కౌడిపల్లి (ప్రభన్యూస్​): మెదక్​ జిల్లాలో దారుణం జరిగింది. కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేటు సమీపంలో కారు యాక్సిడెంట్​కు గురయ్యింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు సమాచారం. నర్సాపూర్ నుండి కౌడిపల్లి వైపు వస్తున్న ఓ కారు.. ట్రాక్టర్​ని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న కంచనపల్లి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ స్వరూప, ఆమె కూతురు శ్రీలత అక్కడికక్కడే చనిపోయారు. ఆమె భర్త మల్లేశం కోమా స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement