Saturday, May 4, 2024

BRO ప్రీ-రిలీజ్ ఈవెంట్ రెండు గంట‌ల ఆల‌స్యం.. అభిమానుల నిరాశ‌

స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ క‌లిసి చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ BRO. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ మూవీ ఈ నెల (జూలై) 28న థియేటర్లలోకి రానుండ‌గా.. ఇవ్వాల‌ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేక‌ర్స్.

అయితే, హైద‌రాబాద్ లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, సినీ నిర్మాతలు BRO ప్రీ-రిలీజ్ ఈవెంట్ టైమింగ్‌లో స్వల్ప మార్పును ప్రకటించారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ టైమింగ్ రీషెడ్యూల్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు. కాగా, మేక‌ర్స్ తెలిపిన వివ‌రాల మేర‌కు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాత బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. థ‌మ‌న్ ఎస్.ఎస్ సంగీతం అందించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement