Friday, May 3, 2024

బాక్సాఫీస్ బిగ్ క్లాష్.. షారూఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీకి పోటీగా స్పైడర్ మ్యాన్

ఇటీవలే పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాలో నయనతార కథానాయికగా నటిస్తోంది.

ఇక, సోనీ పిక్చర్స్ ఇండియా యానిమేషన్ సూపర్ హీరో మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రీసెంట్ గా రిలీజ్ అయింది. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్, ఈ యానిమేటెడ్ మూవీ 2018 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వెర్స్‌కి సీక్వెల్. జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్, జస్టిన్ కె. థాంప్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో 10 భాషలలో రిలీజ్ కానుంది.

ప్రమోషనల్ మెటీరియల్, ప్రీక్వెల్ బ్లాక్ బస్టర్ విజయం కారణంగా ఈ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా, ఈ మూవీ ఇండియాలో జూన్ 2న రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ జవాన్ కూడా 5 భాషల్లో అదే రోజున రిలీజ్ కానుంది. కాగా, ఈ ఏడాది ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ లలో ఈ రెండు సినిమాలు పోటీ పడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement