Wednesday, May 8, 2024

మ‌ళ్లీ బోల్డ్ గా పాయ‌ల్.. మంగ‌ళ‌వారం నుండి పోస్ట‌ర్

హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ మ‌ళ్లీ బోల్డ్ గా సంద‌డి చేయ‌నుంది. ద‌ర్శ‌కుడు అజయ్ భూప‌తికి హిట్టిచ్చిన బోల్డ్‌ జానర్‌లోనే మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ముప్పై పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలిపాడు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని హీరోయిన్‌ పోస్టర్‌ను రివీల్‌ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ శైలజ అనే పాత్రలో నటిస్తుంది. ఈ మేరకు మేకర్స్‌ ఓ బోల్డ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హాప్‌ నేకుడ్‌గా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు పెంచింది. అంతేకాకుండా పాయల్‌ కంట్లో నుంచి నీళ్లు రావడం కూడా పోస్టర్‌లో చూపించారు. దాంతో ఈ సినిమా కేవలం బోల్డ్‌ కంటెంట్‌తోనే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త కథను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో 1990లో జరిగే కథ ఇదిని తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియాలో సినిమా రాలేదని అజయ్‌ భూపతి తాజాగా వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement