Monday, May 6, 2024

కొరటాల బర్త్ డే…. అప్డేట్ వస్తుందా ?

మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కొరటాల శివ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే ఈ సినిమా తర్వాత కొరటాల శివ శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే కొరటాల శివ పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన స్పెషల్ ట్రీట్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య నుంచి సెకండ్ సింగల్ లేదా ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఏమైనా వస్తుందా అని భావిస్తున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం వీటిపై గ్యారెంటీ లేదని చెబుతున్నారు. మరి చూడాలి ఏమైనా అప్డేట్ వస్తుందో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement