Saturday, July 27, 2024

Movies | దసరా బరిలో బ‌డా సినిమాలు.. !

టాలీవుడ్ నుంచి ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా పండుగలకు భారీగా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకోగా రానున్న దసరా రిలీజ్ పై అందరి దృష్టి ఉంది. దసరా బరిలో ఏ సినిమాలు నిలుస్తాయి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకభిమానులు. ఇక సినీ మేకర్స్ కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆ విధంగా ఇప్పటికే దసరా బారిలో ఎన్టీఆర్, కొరటాల శివల దేవర పార్ట్ 1 బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ల కలయికలో తెరకెక్కుతున్న పేట్రియాటిక్ యాక్షన్ మూవీ ‘తండేల్’ కూడా దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా దర్శకుడు చందూ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ చెప్పారు.

ఇక నటసింహం బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కూడా దసరా బరిలో నిలవనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ కి సంబంధించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అదే నిజం అయితే దసరా బరిలో టాలీవుడ్ నుండి మొత్తం మూడు బడా సినిమాల మధ్య బాక్సాఫిస్ క్లాష్ తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement