Wednesday, July 24, 2024

IPL | ఐపీఎల్‌ మొదలయ్యేది అప్పుడే.. తేల్చేసిన ఛైర్మన్‌

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 17వ సీజన్‌ వచ్చే నెలలో మొదలవుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే.. తేదీ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ ఏడాది దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను రెండు దఫాలుగా జరిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రారంభ తేదీ ఇంకా వెలువడలేదు. తాజాగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఈ టోర్నీ ప్రారంభమయ్యే తేదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 22 నుంచి 17వ సీజన్‌ను చెన్నై వేదికగా మొదలుపెట్టనున్నట్టు ధుమాల్‌ తెలిపారు.

మార్చి 22 నుంచి సీజ‌న్‌..

అరుణ్‌ ధుమాల్‌ మాట్లాడుతూ.. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్‌ -17ను ఆరంభించాలని మేం ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలతోనే సమన్వయం చేసుకుంటున్నాం. టోర్నీలో కొంత షెడ్యూల్‌ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు మొత్తం భారత్‌లోనే జరుగుతాయి..’ అని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement