Thursday, July 25, 2024

Keerthy Suresh:కీర్తి తొలి ముద్దు ఆ హీరోకే

లాస్ట్ ఇయర్ తెలుగులో దసరా తో సూపర్ హిట్ అందుకున్న కీర్తీ సురేష్ తమిళ్ లో కూడా మామన్నన్ సినిమాతో సత్తా చాటింది. ఇక మరోపక్క భోళా శంకర్ లో కూడా నటించిన అమ్మడు ఆ సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేసింది. ఈ ఇయర్ ఇప్పటికే తమిళంలో 4 సినిమాల దాకా చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన తెరి రీమేక్ గా బేబీ జాన్ తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో నటించేందుకు కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో ముందు లిప్ లాక్ సీన్ అనుకోలేదు కానీ అది ఉంటే బాగుంటుందని డైరెక్టర్ చెప్పగా అందుకు ముందు వద్దని వారించిన కీర్తి సురేష్ ఫైనల్ గా దానికి ఓకే అనేసిందట. కీర్తి సురేష్ కెరీర్ లో చేయబోతున్న మొదటి లిప్ లాక్ సీన్ ఇదే అని చెప్పొచ్చు. వరుణ్ ధావన్ కు ఈ ముద్దు ద‌క్క‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement