Thursday, April 25, 2024

దివికి అలాంటి వాడు మొగుడుగా రావాలట..!

బిగ్ బాస్ సీజన్ 4 చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అప్పటి వరకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు.. కానీ ఒక్క సీజన్ తో స్టార్స్ అయిపోయారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్లకు అవకాశాలు కూడా వస్తున్నాయి. అలా బిగ్ బాస్ 4 నుంచి ఫేమస్ అయిన ముద్దుగుమ్మ దివి. తాజాగా తన కెరీర్ గురించి కొన్ని ముచ్చట్లు చెబుతూ అలాగే పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయిపోయింది. తనకు ఎలాంటి భర్త కావాలో కూడా చెప్పింది దివి. తన హైట్ 5.8 కాబట్టి తనకు కాబోయే వాడు కనీసం 6.3 అడుగులు ఉండాలని కోరుకుంటుంది..తెలివైనవాడు అయి ఉండాలని.. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలని.. అలాగే తనను చాలా బాగా చూసుకోవాలి అంటుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పే వాడు అయితే ఒక అమ్మాయికి అంతకంటే కావలసింది ఏముంది.. తనకు కూడా అలాంటి భర్త కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది దివి. మరి ఈమె కోరుకున్న వాడు ఎక్కడ ఉన్నాడో.. ఎప్పుడు వస్తాడో..?

మహర్షి లాంటి సినిమాలో మహేష్ బాబు పక్కన నటించినా కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాలేదు. కానీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత అక్కడ 50 రోజులు ఉండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బయటికి వచ్చిన తర్వాత మిగిలిన వారితో పోలిస్తే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కెరీర్లో ముందుకు వెళ్తుంది ఈ భామ. ఈ మధ్య రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. అంతే కాదు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది దివి.

Advertisement

తాజా వార్తలు

Advertisement