Thursday, May 2, 2024

భోళా శంక‌ర్ షూట్ స్టార్ట్..

వేదాళం చిత్రానికి రీమేక్ గా తెర‌కెక్కుతోంది భోళాశంక‌ర్..మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే షూటింగ్‌కు బయలుదేరే ముందు దర్శకుడు మెహర్ రమేష్ పెద్దమ్మ తల్లి అశీసులు తీసుకున్నారు. “పెద్దమ్మ తల్లి అశీసులుతో ‘భోళా శంకర్’ ఫస్ట్ దయూ షూటింగ్ కు బయలుదేరాను” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సుమారు ఏడాది పాటు మెహర్ రమేష్ కథపై వర్క్ చేసినట్టు నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనున్నారు. ఫస్ట్ డే షూటింగ్ లో తమన్నా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ భాగస్వామ్యంతో అనిల్ సుంకరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, రావు రమేష్ న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement