Monday, May 6, 2024

నరసన్న ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం..ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..

కోరుకొండ: కార్తీకమాసం అంటేనే హిందువులు ఎంతో పవిత్ర మాసంగా భావించి, శ్రద్ధగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. కోరుకొండ ఆలయ అభివృద్ధికి ప్రొఫెషనల్ టీం చేత పూర్తి సర్వే చేయించామ‌న్నారు.

డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాగానే ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. కోవిడ్ దృష్ట్యా కొంత జాప్యం జరిగిందన్నారు. స్వామివారి చల్లని ఆశీస్సులతోనే కోవిడ్ నుండి త్వరగా కోలుకున్నామ‌న్నారు. అందులో భాగంగానే కోరుకొండ హరిచంద్ర ప్రసాద్ రెడ్డి స్వామివారికి మొక్కులో భాగంగా 108 పానకం బిందెలతో స్వామివారి పాద పద్మములకు అభిషేక కార్యక్రమం నిర్వ‌హించామ‌న్నారు.. భక్తుల అభీష్టం మేరకు కార్తీక మాసంలో ప్రతిరోజూ స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం చేపట్టామ‌న్నారు. రేపు సాయంత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుని కోనేరు వద్ద తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement