Thursday, July 25, 2024

#BB4 | న్యూ మూవీ.. బాలకృష్ణకు బోయపాటి బర్త్ డే గిఫ్ట్..

నట సింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కొత్తి సినిమాని ఎనౌన్స్ చేశారు మేక‌ర్స్. హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌న్ అయిన బోయపాటి – బాల‌కృష్ట కాంబినేష‌న్‌లో మరో సినిమా రానుంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించబోయే కొత్త సినిమాను అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ‘లెజెండ్’ చిత్ర నిర్మాణంలోనూ వారు భాగస్వాములు.

కాగా, హీరోగా బాలకృష్ణ 110వ చిత్రమిది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా అయితే… నిర్మాతలతో రెండోది! ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement