Monday, June 24, 2024

Noor Malabika Das | బాలీవుడ్ న‌టి ఆత్మ‌హ‌త్య‌…

బాలీవుడ్ నటి నూర్ మలాబికా దాస్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ముంబైలోని ఆమె అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు కుళ్లిపోయిన స్థితిలో నూర్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

ఆమె మరణానికి రెండు వారాల ముందు, కుటుంబ సభ్యులు ముంబైలోని నటి నివాసానికి వెళ్లారు. కాగా, ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు రాకపోవడం గమనార్హం. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో సహాయంతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement