Thursday, April 25, 2024

బంగార్రాజు సెట్ రెడీ…స్టార్ట్ చేయటమే ఆలస్యం

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో రమ్యకృష్ణ,, లావణ్య త్రిపాటి, అనుష్క, అనసూయ ఒంటి స్టార్ట్స్ నటించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ పూర్తయినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ ఇందులోనే మొదలు కానుందని తెలుస్తోంది. నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య కూడా కూడా నటిస్తున్నారు. చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement