Monday, April 15, 2024

టాలీవుడ్ పెద్దలు ఎక్కడ ? ఏపీ ప్రభుత్వం పై బండ్ల గణేష్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడతాడో ఎన్నోసార్లు మనం చూశాం. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి తాను ఒక భక్తుడిని అని చెప్తూ ఉంటారు బండ్లగణేష్.

అయితే తాజా గా ఏపీ ప్రభుత్వ తీరుపై తనదైన శైలిలో స్పందించారు. టాలీవుడ్ పెద్దలపై ఏకంగా ఓ బాంబు వేసారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ విషయంలో ఇంత జరుగుతున్నా…. సినీ పెద్దలు ఎవ్వరికీ పట్టదా అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీంతో బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా టాలీవుడ్ పెద్దలకు ఏమైంది… ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement