Sunday, April 21, 2024

ఐసీయూలో బండ్ల గణేష్ ? తీవ్ర అస్వస్థత

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ గా బండ్ల గణేష్ పేరు నిలిచింది.

ఇక ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బండ్లగణేష్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జ్వరం తో పాటు కరోనా లక్షణాలతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో బండ్లగణేష్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బండ్లగణేష్ గాని ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement