Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 28
28
సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్‌ |
వినశ్యత్స్వవినశ్యంతం
య: పశ్యతి స పశ్యతి ||

తాత్పర్యము : సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహము నందలి ఆత్మ, పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపనివారుగా తెలిసికొనగలిగినవాడు యథార్థ దృష్టిని కలిగినవాడు.

భాష్యము : సత్సాంగత్యములో మూడు విషయాలను స్పష్టముగా అర్థము చేసుకొనవచ్చును. అనగా ఈ శరీరము, దాని ఈశ్వరుడైన ఆత్మ మరియు అతని స్నేహితుడు, పర మేశ్వరుడూ అయిన పరమాత్మ తత్త్వాన్ని సరిగ్గా అర్థము చేసుకున్న తత్త్వ దర్శి సాంగత్యము లేనిచో ఈ జ్ఞానాన్ని సరిగ్గా అర్థము చేసుకొనలేరు. వారు ఈ శరీరమే సర్వస్వమని, మరణముతో అంతా నశిస్తుందని భావించుదురు. అయితే వాస్తవానికి అది నిజము కాదు. ఆత్మ పరమాత్మలు శాశ్వతమైనవి శరీరము నశించిన తరువాత కూడా వారు కొనసాగుచునే ఉంటారు. ఈ అవగ3ఆమన కలవారే సత్యాన్ని చూడగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement