Sunday, February 25, 2024

‘డేగల బాబ్జీ’ ట్రైలర్ రిలీజ్

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మూవీ ‘డేగల బాబ్జీ’. ఈ సినిమా ట్రైలర్ ను డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల గణేష్ నటన ఆకట్టుకుంటోంది.

హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారని మూవీ టీం చెబుతోంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైల‌ర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు.

ట్రైలర్ విడుదల నేపథ్యంలో బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మీ అభిమానం కావాలి. మీ అండ కావాలి. మీరే నాకు కొండంత బలం. వస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

https://twitter.com/ganeshbandla/status/1457573466127802374
https://twitter.com/ganeshbandla/status/1457573122756935685

Advertisement

తాజా వార్తలు

Advertisement