Friday, April 26, 2024

ట్రెండింగ్ లో అఖండ టీజర్….5 మిలియన్ వ్యూస్

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్ లో నందమూరి బాలకృష్ణ డిఫరెంట్ గెటప్ తో రౌద్రంగా అదిరిపోయే డైలాగ్స్ చెపుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే ఈ టీజర్ రిలీజ్ అయిన తక్కువ టైమ్ లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వ్యూస్ తోపాటు లైక్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయ్. విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించి అఖండ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ స్థానం లో ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు , పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement