Saturday, April 27, 2024

అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అర్జున్ రెడ్డి సినిమా రీల్ హీరోయిన్

సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ ను తీసుకువచ్చింది. విజయ్ దేవరకొండ కు హీరోగా నిలదొక్కుకునేందుకు మంచి అవకాశాన్ని తీసుకువచ్చింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలు నటించిన జియా శర్మ మాత్రం ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ఆ సినిమాలో జియా నటన అందరినీ ఆకట్టుకున్న ప్పటికీ…ఆమె హీరోయిన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

అయితే అందుకు కారణం లేకపోలేదట. క్యాన్సర్ తో పోరాడుతున్న తన తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకు కెరీర్ ను పక్కనపెట్టి పెట్టిందట. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ ను కూడా నేను ఎంజాయ్ చేయలేక పోయాను. ఆ సమయంలో కనీసం సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన లేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ ను వినియోగించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు జియా శర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement