Friday, May 3, 2024

అప్ప‌ర రాణి హీరోయిన్ గా త‌ల‌కోన … హిట్ కొట్టాల‌న్న ఆర్జీవీ.

అక్షర క్రియేషన్‌ పతాకంపై స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో, నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా , అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘తలకోన’ నవంబర్‌ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ, నటుడు శివాజీరాజా ప్రముఖ నిర్మాత రామారావు విచ్చేసి పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ హిట్ సాధించాల‌ని ఆర్జీవీ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement