Tuesday, May 7, 2024

న‌వ్వులు పూయిస్తున్న అంటే సుంద‌రానికి ట్రైల‌ర్..

అంటే సుందరానికీ..! వెరైటే టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. నాచురల్‌ స్టార్‌ నాని, మొద‌టి సారి తెలుగు తెరపై న‌టిస్తున్న‌ మలయాళ బ్యూటీ నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది.. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆఖ‌రికి రిలీజైంది. పక్కా బ్రాహ్మణుడైన సుంద‌రం.. క్రైస్తవ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. సాంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లను నిష్టగా ఆచరించే సుందరం కుటుంబం అతడి వివాహానికి ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement