Tuesday, May 7, 2024

గేమ్ ఛేంజ‌ర్ లో కీల‌క పాత్ర‌లో అంజ‌లి.. ఫ‌స్ట్ లుక్ అదుర్స్

తెలుగ‌మ్మాయి అంజ‌లి ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. ఆమె న‌టిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజ‌ర్. ఈ చిత్రంలో అంజ‌లి ఓ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్ అంజ‌లి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. నల్లరంగు సూట్ దరించి, కళ్ల జోడు పెట్టుకొని, చేతిలో ఫైల్ తో మెట్లు ఎక్కుతున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో అంజలి ఓ అధికారి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా ఆద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.షాపింగ్ మాల్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ముందుగా తమిళంలో తనను తాను నిరూపించుకొని టాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తన సహజమైన నటనతో నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతోనూ ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement