Saturday, October 12, 2024

Stars : బాలీవుడ్ – టాలీవుడ్ తార‌ల‌తో యానిమల్ ప్రీ రిలీజ్ వేడుక సంద‌డే సందేడి

హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రణ్ బీర్ .. రష్మిక .. అనిల్ కపూర్ .. బాబీ డియోల్ ప్రధానమైన పాత్రలను పోషించారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈవెంటుకి చీఫ్ గెస్టుగా రాజమౌళి – మహేశ్ బాబు హాజరయ్యారు. ఈ ఈవెంట్ ఇటు టాలీవుడ్ , అటు బాలీవుడ్ను క‌లిపింది.. ఈ వేడుక‌లో మహేశ్ బాబు మాట్లాడుతూ .. ” మీరందరూ ఇంతగా వచ్చి ఈ సినిమాను సపోర్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం .. అతని సినిమాలన్నా ఇష్టం. మొన్ననే ట్రైలర్ చూశాను .. మెంటల్ వచ్చేసింది అంతే. నేనెప్పుడూ ఇలా చెప్పను .. కానీ ఈ ట్రైలర్ చూసి అలా ఫీలయ్యాను. ఇలాంటి ఒరిజినల్ ట్రైలర్ ఇంతవరకూ నేనైతే చూడలేదు” అన్నారు.

“ఇందాక ఎవరో అన్నారు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించిందని. అందువలన ఇది నాకు ప్రీ రిలీజ్ ఈవెంటులా కాకుండా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లా అనిపిస్తోంది. అనిల్ సార్ మా అందరికీ స్ఫూర్తి .. రణ్ బీర్ కపూర్ కి నేను పెద్ద ఫ్యాన్ ను. ఉన్న అన్ని లాంగ్వేజస్ లో రష్మిక చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఇక ర‌ణ‌బీర్ మాట్లాడుతూ, తాను మ‌హేష్ కు పెద్ద ఫ్యాన్ అని అన్నాడు.. రాజ‌మౌళి కూడా యానిమ‌ల్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని ఆకాంక్షించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement