Friday, April 26, 2024

నాకు నెగిటివ్ వచ్చింది…అల్లు హీరో

అల్లు అరవింద్ , అల్లు అర్జున్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. కాగా తాజాగా కరోనా టెస్టులు చేయించుకున్న అల్లు శిరీష్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రోజు కరోనా టెస్ట్ చేయించుకున్నానని… తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పుకొచ్చారు అల్లు శిరీష్.

ఇదిలా ఉంటే ఫిల్మిస్టార్స్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఒక్కొక్కరికి ఒక్కొకటి ఉంటుంది. అయితే తాను మాత్రం మూడు ప్రదేశాలలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతానని ఒకటి కాఫీ షాప్, రెండోది బుక్ స్టోర్, మూడోది తన ఇంట్లోని గార్డెన్ అంటూ తెలిపాడు. మొదటి రెండు సంగతి పక్కన పెడితే ఇంట్లో గార్డెన్ మాత్రం ఇప్పటి రోజుల్లో సేఫ్ ప్లేస్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు శిరీష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement