Wednesday, May 1, 2024

స్నేహారెడ్డి అదిరిపోయే విన్యాసం..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు తన ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియోలు నెటిజన్లతో పంచుకుంటుంది.. స్నేహరెడ్డికి కూడా కూడా సోషల్ మీడియాలో హీరొయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ఉంది… అయితే తాజగా స్నేహరెడ్డి ఫోస్ట్ చేసిన ఓ ఫోటో తో బన్ని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తలకిందులుగా పెట్టి గాల్లో వేలాడుతూ ఉన్న ఓ యోగాసనం ఫోటోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది..స్నేహా రెడ్డి కొన్నాళ్లుగా యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటుంది. అయితే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఎట్ట‌కేల‌కు అది సాధించింది. త‌న సోష‌ల్ మీడియాలో స్నేహా రెడ్డి ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయ‌గా, దీనిపై క‌ళ్యాణ్ దేవ్ స్పందించారు. మొత్తానికి సాధించావు అని రిప్లై ఇచ్చారు. గ‌తంలో ఇలాంటి ఫీట్స్ ఆదాశ‌ర్మ‌తో పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా చేశారు. కాగా, సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి ఇటీవ‌ల 4మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ మార్క్ చేరుకుంది. ఇండ‌స్ట్రీలో ఏ సెల‌బ్రిటీ భార్య కూడా ఫీట్ సాధించ‌క‌పోవ‌డంతో అయామ్ ది క్వీన్ అంటుంది స్నేహా రెడ్డి.

ఇది కూడా చదవండి: ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన కమెడియన్ అలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement