Saturday, April 27, 2024

కేజీఎఫ్2 రిలీజ్ డేట్ కోసం అందరి చూపులు!!

దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఒక్కో సినిమా రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు అంతా కూడా కేజిఎఫ్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

కే జి ఎఫ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్, ప్రకాష్ రాజు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement