Thursday, May 2, 2024

‘అలిపిరికి అల్లంత దూరంలో’ టీజర్ రిలీజ్​

కాస్కేడ్‌ పిక్చర్స్‌ పతాకంపై నూతన నటుడు రావణ్‌ నిట్టూరు కధానాయకుడిగా రమేష్‌ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్‌ డైరెక్టర్‌ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్‌ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ విడుదలైయింది. నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్‌ లో కథా నేపధ్యాన్ని చాలా ఆసక్తికరంగా రివిల్‌ చేశాడు దర్శకుడు.

తిరుపతిలో ఫోటోల షాపు పెట్టుకోవాలని తపించే హీరో, అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై చాలా క్యూరీయాసిటీని పెంచాయి. రావణ్‌ అద్భుతమైన నటన కనబరిచారు. టీజర్‌ లో కనిపించిన మిగతా నటీనటులంతా చక్కని అభినయం కనబరిచారు. టీజర్‌ ఫణి కళ్యాణ్‌ అందించిన నేపధ్య సంగీతం బ్రిలియంట్‌ గా వుంది.

డిజికె కెమరాపనితనం డీసెంట్‌ గా వుంది. తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలై ”మా తిరుపతి” పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా తిరుపతి పాట రిలీజ్‌ అయిన రోజు నుండి వరుసగా 12 రోజులు టాప్‌ ట్రెండింగ్‌ లో ఉంటూ 30 లక్షలు పైన వ్యూస్‌ ని సాధించి చార్ట్‌ బస్టర్ హిట్‌ గా నిలిచింది.

https://youtu.be/-vHxjU2z_Qs
Advertisement

తాజా వార్తలు

Advertisement