Wednesday, April 24, 2024

‘అజయ్‌ గాడు’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌.. ఆకట్టుకుంటున్న ఫస్ట్​ లుక్​ టైటిల్​

ఇటీవల విశ్వక్‌తో ముద్ర వేసిన అజయ్‌ కతుర్వార్‌ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. అతను ఇటీవల తన రాబోయే చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ని ఈరోజు రిలీజ్‌ చేసారు. టాలెంటెడ్‌ యంగ్ హీరో సత్య దేవ్‌ ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ ను ఆవిష్కరించారు. ”అజయ్‌ గాడు” అనే టైటిల్‌ అందర్నీ ఆకట్టుకుంది.

అజయ్‌ కతుర్వార్‌ ఇప్పుడు తన ఫస్ట్‌ లుక్‌ తో అందరి దష్టిని ఆకర్షించాడు. త్వరలోనే ఫైర్‌ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ను అజయ్‌ కర్తుర్వార్‌ దర్శకత్వం వహించారు. చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్‌ కుమార్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందాల భామలు భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement