Friday, April 26, 2024

ఓటీటీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న అక్కినేని హీరో

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే విక్రమ్ థాంక్యూ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ఒక ఒరిజినల్ ఓటీటీ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి పలు రకాల స్క్రిప్టులను చూశారట. ఆఖరికి ఒక స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం దర్శకుని కోసం వెతుకుతున్నారట. ఇక నాగచైతన్య బాలీవుడ్లో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బంగార్రాజు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు నాగచైతన్య. దానితో పాటే ఓటీటీ చిత్రానికి కూడా సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement