Thursday, March 28, 2024

నారప్ప పై తిమ్మరుసు ప్రశంసలు

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కింది. అయితే ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా వెంకటేష్ నటనపై సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో సత్యదేవ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. నారప్ప లో వెంకీ మామ ఊర మాస్ రాంపేజ్ ని ఎంజాయ్ చేశానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కి కంగ్రాట్స్ చెబుతూ యువ నటుడు కార్తీక్ రత్నం కి అభినందనలు తెలిపారు. కాగా సత్యదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement