Friday, April 26, 2024

అఖండ మళ్లీ వస్తాడు.. సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్న బోయపాటి

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సంచలన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సినిమా ఆకట్టుకుంది. కాగా, ఆ సినిమాకు సీక్వెల్ ఉండ‌బోతున్న‌ట్టు బోయపాటి ఓ హింట్ ఇచ్చాడు. అనంతరం కొన్ని సందర్భాల్లో వేదికపై మాట్లాడుతూ ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే అందుకు సమయం ఉందని అన్నారు. ఇప్పుడు బోయపాటి ఈ సినిమా సీక్వెల్ కథపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని చిన్న పాప‌ యుక్తవయస్సులోకి ప్రవేశిస్తుంది.. అయితే ఆ పాపకు ఇచ్చిన మాట కోసం ‘అఖండ’ తిరిగి రావడంతో సీక్వెల్ కథ ప్రారంభమవుతుంది. గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత అనిల్ రవిుడి సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ‘అఖండ’ సీక్వెల్‌లో నటించనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement