Sunday, April 28, 2024

అఖండ‌2.. సీఎం జ‌గ‌న్ టార్గెట్ గా డైలాగ్స్

డిసెంబ‌ర్ 2021లో రిలీజ్ అయిన అఖండ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందించిందో తెలిసిన విష‌య‌మే. కాగా అవుట్-అండ్-అవుట్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భక్తిరస కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యంతో ఆక‌ట్టుకున్నాడు హీరో బాల‌కృష్ణ‌.ఇక థమన్ స్వరపరిచిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్ ఈ చిత్రాన్ని నిలబెట్టిన బలమైన పాయింట్‌లలో ఒకటి.ఈ చిత్రాకి సీక్వెల్‌ను రూపొందించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవిత్రమైన మహా శివరాత్రి రోజున, స్వరకర్త ఎస్ఎస్ థమన్ సోషల్ మీడియాలో సీక్వెల్‌ను ధృవీకరించారు. దేవునిపై నమ్మకం ఉంచండి. గాడ్ బ్లెస్. త్వరలో అఖండ 2లో కలుద్దాం. అయితే ఇప్పుడు పూర్తిగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో ద‌ర్శ‌కుడు బోయపాటి ఈ చిత్రానికి సరపడ కథను రెడీ చేసినట్లు సమాచారం. బాలయ్య కి చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారట‌.. అఖండ 2 లో రాజకీయ అంశాలే మెయిన్ హైలైట్ గా ఉంటాయంటున్నారు. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ డైలాగులు,సీన్స్ ఉంటాయట‌. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రచార చిత్రంగా కూడా ఈ సినిమా కలిసి రావాలని బాలయ్య చెప్పారట. అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాలయ్య చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అఖండ సీక్వెల్ కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement