Thursday, May 2, 2024

అమ్మ సెంటిమెంట్ తో అజిత్ వలిమై

తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రల్లో హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వలిమై. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ యాక్టర్ కార్తికేయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రధానంగా అమ్మ సెంటిమెంట్ ఉంటుందట. ఇక యువన్ శంకర్ రాజా అమ్మ పై ప్రత్యేకంగా స్వరపరిచిన ఓ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement