Friday, October 4, 2024

ఆదిపురుష్​ త్రీడీ టిక్కెట్​ రేట్ల తగ్గింపు.. సినీ లవర్స్​ని థియేటర్​కి రప్పించే ప్లాన్​

జూన్ 16న గ్రాండ్ గా విడుదలైన ఆదిపురుష్ సినిమా ఆశించిన అంచనాలను అందుకోనప్పటికీ.. థియాట్రికల్ రన్ కొనసాగిస్తూ చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. కాకపోతే తొలివారం తర్వాత వసూళ్ల జోరు చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆడియన్స్ అందరినీ థియేటర్ల బాట పట్టించడంలో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సినిమా 3D వర్షన్ టికెట్ రేట్లు భారీగా తగ్గించేశారు. 3Dలో ఆదిపురుష్ సినిమాను కేవలం 112 రూపాయలకే చూడవచ్చని టీ సిరీస్ అధికారికంగా ప్రకటించింది.

ప్రభాస్ హీరోగా రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటించింది. 2డీ, 3డీలో ఐదు భాషల్లో భారీ ఎత్తున ఈ ఆదిపురుష్ సినిమాను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement