Saturday, May 11, 2024

డైరెక్టర్ గా ప్రియదర్శి..రిస్క్ లేకుంటే మిగిలేది రస్కే !!

ప్రియదర్శి…ఈ పేరుకి ఇప్పుడు పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగులతో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ప్రియదర్శి తెలుగులో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ప్రియదర్శి రూట్ మార్చబోతున్నాడు. దర్శకుడి గా ఎంటర్ అయ్యేందుకు రెడి అవుతున్నాడు.

ఒక కహానీ లాక్ చేశా… దర్శకత్వం నేనే త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు ప్రకటిస్తా అంటూ ప్రియదర్శి ప్రకటించాడు. గతంలో వెన్నెల కిషోర్ కూడా కమెడియన్ గా మంచి జోష్ లో ఉన్న సమయంలో దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. ఆ సినిమా బెడిసికొట్టింది. ఇప్పుడు ప్రియదర్శి కూడా అదే పని చేయబోతున్నాడు. మరి విజయం సాధిస్తాడో వెన్నెల కిషోర్ లా బోల్తా కోడతాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement