Sunday, April 28, 2024

హరిహర వీరమల్లు షూటింగ్ లో ప్రమాదం

షూటింగ్ లో నటీనటులు అప్పుడప్పుడు గాయపడుతూ ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు పెద్దగా రిస్క్ లేకపోయినా… హిస్టోరికల్ సినిమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఆదిత్య మీనన్ గాయపడ్డారు.

ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతుందట. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆదిత్య మీనన్ పరిస్థితి కూడా బాగానే ఉందని తెలుస్తోంది. ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంను ఎం రత్నం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement