Friday, April 26, 2024

నరుడి బ్రతుకు నటన….స్టార్ట్ అయింది

టాలీవుడ్ యంగ్ హీరోగా సిద్దు జొన్నలగడ్డ ,నేహా శెట్టి జంటగా గా తెరకెక్కుతున్న చిత్రం నరుడి బ్రతుకు నటన. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విమల్ కృష్ణ కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రానికి రచయితగా పనిచేశారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.

అయితే ఈ సినిమా ఓ కొత్తతరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఉంటుందని అన్నారు దర్శకుడు విమల్ కృష్ణ. ఇక మిగిలిన ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ నటిస్తున్నట్లు తెలిపారు. కాగా నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫోటోలను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement