Wednesday, April 24, 2024

‘మా’లో ఆ నలుగురు.. ప్రకాష్ రాజ్ టీమ్ ఇదే…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు సాధార‌ణ ఎన్నిక‌ల క‌న్నా ర‌స‌వ‌త్తరంగా మారతున్నాయి.  ఈ సారి మాత్రం ఏకంగా నలుగురు అధ్యక్ష బరిలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లోకి బరిలోకి మొదటి హీరో మంచు విష్ణు దిగారు. ఆ తర్వాత తానూ పోటీ చేస్తున్నట్టు ప్రకాష్‌ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్, నటి హేమలూ బరిలోకి దిగుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. ఎన్నికలను రసవత్తరంగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. మొత్తం 27 మందితో జాబితాను విడుదల చేశారు.

ప్రకాష్ రాజ్ టీమ్ ఇదే

ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీశ్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, క్ష్మీయ్యూం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జీవిత, హేమలకు ఎవరు ప్రచారం చేస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఈ నలుగురు మాత్రం మా అసోసియేషన్ కు మంచి చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement