Sunday, May 19, 2024

నా క‌ల నెర‌వేరింది.. కొత్త ఇంట్లోకి హిమ‌జ‌

ఆడ‌ప‌డ‌ద‌ప ప‌లు చిత్రాల్లో న‌టిస్తుంది న‌టి హిమజ. కాగా ఆమె కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీదేవి పటం పట్టుకొని ఉన్న హిమజ చిరు నవ్వులు పూయించారు. పట్టువస్త్రాలు నిండుగా తయారయ్యారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. కొత్త ఇల్లు నిర్మించుకోవడం అంటే మన కలలు నెరవేర్చుకోవడం, జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం. నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను, అని కామెంట్ చేశారు. హిమజ నూతన గృహప్రవేశం చేసిన నేపథ్యంలో అభిమానులు, మితృలు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఆధునిక హంగులతో అత్యంత విలాసవంతంగా హిమజ ఇంటిని నిర్మించుకున్నట్లు సమాచారం. దాని విలువ కోట్లలో ఉంటుందని వినికిడి. కాగా సీరియల్ నటిగా హిమజ కెరీర్ మొదలైంది. అనేక చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. నేను శైలజ, జనతా గ్యారేజ్, స్పైడర్, శతమానం భవతి, వినయ విధేయ రామ వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement