Monday, April 29, 2024

ఆదిపురుష్ ర‌న్ టైమ్ ..2గంట‌ల 54నిమిషాలు

ఆదిపురుష్ మూవీ ర‌న్ టైమ్ రివిల్ అయింది. ఈ మూవీ 2గంటల 54 నిమిషాలు ఉండనుందని సమాచారం. దాదాపు 3 గంటల రన్‌టైమ్‌తో విడుదవుతున్న ఈ సినిమాలో ఎలాంటి అంశాలను చూపిస్తారో అని అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్నాడు. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు ఆది నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా పోస్ట్ పోన్‌ అయింది. గతేడాది రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ఏకంగా ఆరునెలలు సినిమాను పోస్ట్‌ పోన్‌ చేశారు. వీఎఫ్‌ఎక్స్‌ను మెరుగు పరచడం కోసం మరో వంద కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల రిలీజైన ట్రైలర్‌ మాత్రం అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు ఈ సినిమాపై వచ్చిన నెగెటివిటీ అంతా ఒక్క ట్రైలర్‌తో పటాపంచలయింది. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement