Sunday, May 5, 2024

ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో వైష్ణ‌వ్ తేజ్.. ఆదికేశ‌వ గ్లింప్స్ రిలీజ్

హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం ఆదికేశ‌వ‌. ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.ఆదికేశవ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్ మనకు రుద్రగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు మంచి కంటెంట్‌తో పాటు మంచి విలువలతో ప్రేక్షకులను అలరించే చిత్రాలను నిర్మిస్తున్నాయి.ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆదికేశవ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement