Thursday, May 2, 2024

మా హీరోయిన్ ని గుర్తించు… గూగుల్ తల్లి !!

బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరనన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బేబమ్మగా కృతి నటన తో పాటు అందచందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉప్పెన సినిమా హిట్ కావటంతో కృతికి కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం కృతిశెట్టి నాని శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాతో పాటు రామ్ పోతినేని తో కూడా ఓ సినిమా చేయబోతుంది.

ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆమె ఫ్యాన్స్ గూగుల్ లో సెర్చ్ చేస్తే మాత్రం కన్ఫ్యూజన్ చేసే రిజల్ట్ వస్తున్నాయట. కృతిశెట్టి పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. మరో హీరోయిన్‌ ప్రోఫైల్‌ ఓపెన్‌ అవుతోందట. అంతేకాదు, ప్రొఫైల్‌లో ఆమె ఆరు తమిళ సినిమాల్లో నటించినట్లు చూపిస్తుందట. ప్రస్తుతం కృతి శెట్టి పేరున ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ ఆ పేరు సెర్చ్ చేస్తే మాత్రం రెండు ప్రొఫైల్స్‌, రెండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ గూగుల్ పై మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement