Thursday, May 2, 2024

Collections: హనుమాన్ ఖాతాలో రూ.250 కోట్లు

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రాగా తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 17 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. కేవ‌లం రూ12 కోట్ల‌తో ఈ సినిమా నిర్మాత‌ల‌కు వంద‌ల కోట్ల లాభాల పండ‌పండిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే రూ .500 కోట్ల మార్క్ కు చేరిన ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement