Friday, April 26, 2024

సినీ ప్రేక్షకుల వెయిటింగ్ కు బ్రేక్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంతార’

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘కాంతార’. ప‌లు భాష‌ల్లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము లేపేస్తోందీ ఈ మూవీ.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ దీన్ని నిర్మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ‘కాంతార’ 50 కోట్ల రూపాయ‌లకు పైగా వ‌సూళ్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. KGF 2 త‌ర్వాత తెలుగులో భారీ విజ‌యాన్ని సాధించిన క‌న్న‌డ మూవీ ఇదే అంటున్నారు సినీ విశ్లేష‌కులు..

ఇక‌.. థియేట‌ర్స్‌లో చూసినవారు, చూడని వారు.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను మ‌ళ్లీ చూడాల‌ని ‘కాంతార’ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే న‌వంబ‌ర్‌లో రెండు, మూడు డేట్స్‌లో వస్తుందని అందరూ భావించారు. అయితే డిస్ట్రిబ్యూటర్ష్ కోరిక మేరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు అఫీషియల్‌గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. రేపు అంటే న‌వంబ‌ర్ 24న ప్ర‌ముఖ ఓటీటీ చానెల్ అమెజాన్ ప్రైమ్‌లో ‘కాంతారా’ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని సినీ అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement