Friday, May 17, 2024

షూట్ లో ప్రమాదం..హీరోకి గాయాలు

కన్నడ నటుడు రిషబ్ శెట్టి పెట్రోల్ బాంబ్ ప్రమాదంలో గాయపడ్డారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో హీరో అనే చిత్రం తెరకెక్కుతోంది.   ఈ సినిమా యాక్షన్ సీన్స్ ని  హాస‌న్ జిల్లా బేలూరులో చిత్రీక‌రిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ స‌మ‌యంలో రిష‌బ్, గానావి ల‌క్ష్య‌ణ్ పెట్రోల్ బాంబ్ విసిరి పారీ పోతున్న స‌మ‌యంలో వారికి మంట‌లు అంటుకున్నాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది మంట‌ల‌ను ఆర్పి ప్ర‌థ‌మ చికిత్స చేశారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రికి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని వైద్యులు తెలిపారు. ఈ మధ్య కాలంలో డూప్ లేకుండా స్టంట్స్ చేయడానికి పలువురు హీరోలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement