Sunday, May 5, 2024

మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమెన్

ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోంది వండర్ వుమెన్  గాల్ గాడట్. ఈ  విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తన  భ‌ర్త యార‌న్ వ‌ర్సానో, త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి ఉన్న ఓ క్యూట్ పిక్‌ను ఆమెను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల‌కుపైగా అభిమానులు దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ మ‌ధ్యే వండ‌ర్ వుమ‌న్ 1984 మూవీలో గాల్ న‌టించిన విష‌యం తెలిసిందే. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ తెర‌కెక్కించిన ఈ సినిమా థియేట‌ర్ల‌తోపాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజైంది. త్వర‌లోనే హెచ్‌బీవోలో రాబోతున్న జ‌స్టిస్ లీగ్‌లోనూ గాల్ న‌టించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement