Friday, April 26, 2024

బన్నీ రియల్ మెగాస్టార్…రచ్చ లేపుతున్న వర్మ ట్వీట్

రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏం చేసినా వివాదమే. కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అసలు విషయం ఏంటంటే…మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. అదేంటంటే బన్నీ రియల్ మెగాస్టార్ అని…పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్,అల్లు శిరీష్, నిహారిక తక్కువస్థాయి వాళ్లని చెప్పుకొచ్చారు. బిగ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ అండదండా వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లుగా వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది.

అయితే వర్మ ట్వీట్ చేయడానికి కారణం…. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలంతా కూడా మెగాస్టార్ కు విష్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అందులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లేకపోవడం తో వర్మ ఈ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement