Saturday, May 18, 2024

పవర్ ఫుల్ డైలాగ్ తో ‘సీటీమార్’ టీజర్

హీరో గోపీచంద్ ..హీరోయిన్ తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం సీటీమార్. ఈ మూవీని మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొంతుదోంది. కాగా ఆంధ్ర కబడ్డీ కోచ్ గా గోపీచంద్..తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ గా తమన్నా నటిస్తున్నారు.  ఏప్రిల్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తాజాగా టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో గోపిచంద్ చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ సినిమాపై ఆస‌క్తిని పెంచింది. టీజ‌ర్‌లోని స‌న్నివేశాలు  కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం కాగా,  సంపత్ నంది హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. దిగంగ‌న కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement